‘ఎన్ని పిటిషన్లు వేసినా.. వాటిని చేస్తూనే ఉంటా’

26 May, 2021 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఇటీవ‌ల వేలాది మందికి ఫాబీఫ్లూ అనే మందుల‌ను కరోనా బాధితులకు ఉచితంగా అంద‌జేశారు. అయితే దీంతో గంభీర్‌పై కోర్టులో వ్య‌తిరేకంగా వ్యాజ్యం దాఖ‌లైంది. తాజాగా ఈ అంశంపై గంభీర్ స్పందించారు.

ఎన్ని పిటిషన్లు వేసినా...ప్రజా సేవను ఆపను
గంభీర్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావించాను, కనుక ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేను పంపిణీ చేసిన మందులు అత్య‌వ‌స‌ర‌మైన‌వ‌ని, నాపై వేల సంఖ్య‌లో వ్యాజ్యాలు దాఖ‌లు చేసినప్పటికీ తాను మాత్రం ప్రాణాలు ర‌క్షించేందుకు ప్ర‌జాసేవను కొనసాగిస్తానని స్ప‌ష్టం చేశారు.

కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంపీ గౌతం గంభీర్‌ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో పేర్కొన్న విధంగా ఫావిపిరవిర్‌ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో మందులు ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: Rajasthan Cm: కోటి వ్యాక్సిన్‌లు ఓ రోజుకి సరిపోవు

మరిన్ని వార్తలు