కాగ్‌గా బాధ్యతలు చేపట్టిన గిరీశ్ చంద్ర‌ ముర్ము

8 Aug, 2020 12:10 IST|Sakshi

సాక్షి,ఢిల్లీ : గిరీశ్ చంద్ర‌ ముర్ము ఇవాళ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌)గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  ఢిల్లీలోని కాగ్ ఆఫీసులో శనివారం ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా కాగ్ ఆఫీసులో గాంధీ, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు ఆయ‌న నివాళి అర్పించారు.  గ‌త వారం కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ముర్ము జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ముర్ము స్థానంలో మ‌నోజ్ సిన్హా క‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 14వ కాగ్‌గా ముర్ము బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.ఒడిశాలోని మ‌యూర్బంజ్ జిల్లా బెట్‌నోటి గ్రామానికి చెందిన గిరీశ్ చంద్ర 1959, న‌వంబ‌ర్ 21న ముర్ము జ‌న్మించారు. గుజ‌రాత్ ఐఏఎస్ క్యాడ‌ర్‌కు చెందిన  గిరీశ్‌ చంద్ర  మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా చేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు