గతంలోనూ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్‌ ప్రమాదం.. ఎక్కడంటే?

8 Dec, 2021 17:12 IST|Sakshi

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయ‌న భార్య‌ మధులిక, ఏడుగురు ఆర్మీ అధికారులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు 31 2019న భారతదేశపు మొదటి చీఫ్‌ ఢిఫెన్స్‌ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రావత్ గతంలోనూ చాపర్ ప్రమాదానికి గురయ్యారు.

కాగా, ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి బిపిన్‌ రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేస్తున్నారు. దిమాపూర్‌ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న చాపర్‌ కూలిపోయింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకోగా, రావత్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక కల్నల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదంలో జనరల్ రావత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 

చదవండి: Tamilnadu Army Helicopter Crash: తునాతునకలైన హెలికాప్టర్‌.. ఫోటోలు, వీడియో దృశ్యాలు

>
మరిన్ని వార్తలు