మిస్డ్‌ కాల్‌తో గ్యాస్‌ కనెక్షన్‌

10 Aug, 2021 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ కనెక్షన్‌దారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) శుభవార్త చెప్పింది. కేవలం మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ కొత్త కనెక్షన్‌ తీసుకోవడం, ఎల్పీజీæ రీఫిల్‌ వంటి సదుపాయాలు పొందేలా సదుపాయం తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఈ సదుపాయాన్ని 8454955555కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా పొందొచ్చని ఐఓసీ చైర్మన్‌ ఎస్‌ఎం వైద్య సోమవారం వెల్లడించారు. దీనితో పాటు ఒక సిలిండర్‌ కలిగిన వారు మరో సిలిండర్‌ పొందే సదుపాయాన్ని (డబుల్‌ బాటిల్‌ కనెక్షన్‌) ఇంటివద్దకే తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళిక రచించారు. 14.2 కేజీల సిలిండర్‌ ఉన్నవారు బ్యాక్‌అప్‌ కోసం మరో 5కేజీల సిలిండర్‌ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు