తనను ప్రేమగా చూడటం లేదని.. కుటుంబ సభ్యులకు విషమిచ్చి

20 Oct, 2021 03:58 IST|Sakshi

నలుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన బాలిక

చిత్రదుర్గ: తోబుట్టువులతో సమానంగా తనను ప్రేమగా చూసుకోవడం లేదని కక్ష పెంచుకున్న ఓ బాలిక(17).. తల్లి, తండ్రి సహా నలుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఇసాముద్ర గ్రామం లంబనిహట్టిలో జూలై నెలలో చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. విషప్రయోగంతో బాలిక తల్లి, తండ్రి, చెల్లి, అమ్మమ్మ చనిపోగా అన్న(19) అనారోగ్యానికి గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

చిన్న తనం నుంచి అమ్మమ్మ గారింట్లో పెరిగిన బాలిక మూడేళ్ల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, చెల్లి, అన్నపైనే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ చూపడం, తనను పట్టించుకోకపోవడంపై బాలిక ఆవేదన చెందింది. ఈ క్రమంలో కక్ష తీర్చుకునేందుకు వారికి ఓ పర్యాయం విషం కలిపిన ఆహారం పెట్టేందుకు యత్నించి విఫలమైంది.

మరో ప్రయత్నంగా ఈ ఏడాది జూలై 12వ తేదీన పురుగులమందు కలిపి స్వయంగా తయారు చేసిన రాగి ముద్దలను వారికి పెట్టింది. వాటిని తిని, తీవ్రంగా వాంతులు చేసుకుని నలుగురు చనిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల వెల్లడైన ఫలితాల ఆధారంగా వారు తిన్న రాగి ముద్దల్లో విషం కలిసినట్లు తేలింది. పోలీసుల విచారణలో బాలిక నేరాన్ని అంగీకరించింది. మైనర్‌ కావడంతో ఆమెను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు