చాక్లెట్‌ అనుకుని గణేశ్‌ విగ్రహాన్ని మింగేసింది..

25 Jul, 2021 13:43 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): చాక్లెట్‌ అనుకుందో ఏమో ఓ చిన్నారి చిన్నపాటి గణేశ్‌ విగ్రహాన్ని మింగేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. బెంగళూరు నగరంలోని హెచ్‌ఏఎల్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. వెంటనే తమ మూడేళ్ల చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్సరే తీసి పొట్టలో లోహపు విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎండోస్కోపి ద్వారా చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటికి తీశారు. 

తల్లిని తరిమేసిన కసాయి  
మండ్య: ఆస్తి కోసం తన రెండో కుమారుడు దౌర్జన్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని  కేఆర్‌ పేట తాలూకా ఆనేగోళ గ్రామానికి చెందిన కమలమ్మ మీడియా ముందు మొరపెట్టుకుంది. తన భర్త  బతికుండగా రెండో కుమారుడు మంజునాథ్‌కు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని  రాసిచ్చాడని, అయినా ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఇవ్వాలని దౌర్జన్యం చేసి తనను గెంటేశాడని బోరున విలపించింది.   

మరిన్ని వార్తలు