యువతి నిర్బంధం.. గ్యాంగ్‌ రేప్‌

15 Oct, 2020 20:24 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : ఒరిస్సాలోని కటక్‌ నగరం శివారులో మరో ఘోరం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు న గరం బస్టాండ్‌లో నిలబడిన ఓ 17 ఏళ్ల అమ్మాయికి లిఫ్ట్‌ ఇస్తానంటూ మోటారు బైక్‌పై ఎక్కించుకున్న ఓ యువకుడు ఆమెను సరాసరి నగరం శివారులోని తన కోళ్ల ఫారమ్‌కు తీసుకెళ్లి రేప్‌ చేశారు. ఆ దుర్మార్గుడు ఫోన్‌లో తన మిత్రుడిని పిలవగా అతనూ వచ్చి రేప్‌ చేశారు. ఇద్దరు రేప్‌ చేస్తుండగా వారు వీడియో రికార్డు చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినా, ఎవరి సహాయం కోరినా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి ఆ యువతిపై 22 రోజుల పాటు ఇద్దరు యువకులు అత్యాచారం చేస్తూ వచ్చారు.

కోళ్ల ఫారమ్‌లో యువకుల చేష్టలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం వారొచ్చి యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఆ యువతి శారీరక, మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ అనాథాశ్రయానికి పంపించారు. ఆమెపై అత్యాచారం జరిపిన మరో యువకుడి కోసం గాలిస్తున్నట్లు కటక్‌ పోలీసు అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.  ఆ యువతి తండ్రి పెట్టే బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి కటక్‌ వచ్చి తన సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఆమె బావకు ఆమె అక్కడుండం ఇష్టం లేదు. సంతోష్‌ బెహరాలోని తన ఇంటికి పోదామని బయల్దేరిన ఆ యువతిని నిందితుడు లిఫ్ట్‌ ఇస్తానంటూ దారి మళ్లించి మోసం చేశారు. 

ఇలాంటి రేప్‌లకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు సాగిస్తున్నా రేప్‌లు ఆగడం లేదు. భారత్‌లో 15 నిమిషాలకోసారి రేప్‌ జరగుతోంది. గతేడాది రోజుకు 60 చొప్పున దేశంలో రేప్‌లు జరిగినట్లు ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ నివేదిక తెలియజేస్తోంది. 

మరిన్ని వార్తలు