ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు.. ఫొటోలు వైరల్‌

20 Jun, 2022 07:30 IST|Sakshi

భువనేశ్వర్‌: ప్రేమ ముసుగులో వంచించాడని జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు విజయశంకర దాస్‌కు వ్యతిరేకంగా సంచలనాత్మక ఆరోపణలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ప్రియురాలిగా పేర్కొని సోమాలిక దాస్‌(29) అనే యువతి జగత్‌సింఘ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇక, ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే విజయశంకర దాస్, సోమాలిక ఇరువురి అంగీకారం మేరకు రిజిస్టర్‌ వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో అనుబంధ దస్తావేజులతో వివాహం కోసం ఈ ఏడాది మే 17న దరఖాస్తు దాఖలు చేశారు. 

ఈనెల 17తో నెల రోజులు పూర్తి కావడంతో సోమాలిక రిజిస్టార్‌ ఆఫీసుకు సకాలంలో హాజరైంది. అ‍క్కడ 3 గంటలకు పైగా ప్రియుడి కోసం నిరీక్షించింది. ఫోన్‌ చేసినా స్పందించక పోవడంతో నిరుత్సాహపడింది. ఎమ్మెల్యే వైఖరితో ఒక్కసారిగి షాకైంది. పూర్తి అంగీకారంతో వివాహం రిజిస్ట్రేషన్‌ ఖరారు చేసుకున్న సమయానికి హాజరు కాకపోవడం వెనక అపహరణ లేదా వంచన ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. 

తాజాగా ఆదివారం మరో ఆరోపణను తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే మరో ఐదుగురితో కలిసి సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపించింది. దివ్యశంకర దాస్‌కు వ్యతిరేకంగా పోలీసులు కఠిన చర్యలు చేపడతారని గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రియుడితో చనువుగా కలిసి మెలిసి తిరిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

తొందరపాటు చర్య.. 
ఇదంతా తొందరపాటు చర్యగా ఎమ్మెల్యే దివ్యశంకర దాస్‌ కొట్టేశారు. ప్రకటించిన మేరకు సోమాలికను వివాహమాడతానని ఆదివారం మరోసారి బహిరంగంగా ప్రకటించారు. రిజిస్టర్‌ వివాహం దరఖాస్తు దాఖలు నుంచి 90 రోజుల గడువు లోగా పెళ్లి చేసుకునేందుకు వీలవుతుందని గుర్తుచేశారు. ప్రస్తుతం 30 రోజులు మాత్రమే పూర్తయ్యిందని, మరో 60రోజులు గడువు ఉందన్నారు. ఈలోగా మంచి ముహూర్తంలో రిజిస్టర్‌ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమాలిక తనకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రి వివరించానని పేర్కొన్నారు. మరోవైపు తన తల్లి ఆరోగ్యం కూడ బాగోలేనందున వేచి చూస్తున్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు