షాకింగ్‌ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్‌ అయిన మంత్రి

23 Sep, 2022 12:37 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చక్‌దేపూర్‌ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్‌ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి.

ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్‌ జైన్‌ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు జైన్‌ వెల్లడించారు.

ఐతే ఈ ఘటనపై సీరియస్‌ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్‌ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్‌ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సిసోడియా పేర్కొన్నారు.

(చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్‌ బంద్‌, ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం)

మరిన్ని వార్తలు