జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు

20 Aug, 2020 13:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ  యూజ‌ర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్‌తో  హోరెత్తిస్తున్నారు.

జీమెయిల్‌తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా ప‌నిచేయడం మానేశాయి. జీమెయిల్‌ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భార‌త్‌ సహా జ‌పాన్‌, ఆస్ట్రేలియా, కెన‌డా త‌దిత‌ర దేశాల్లోని యూజ‌ర్లు జీమెయిల్‌లో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని డౌన్ డిటెక్ట‌ర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్‌తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.  కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్‌డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు