ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్‌ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ

27 Jan, 2023 19:53 IST|Sakshi

ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్‌ అయ్యిన మరో ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్‌ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్‌ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్‌లైన్‌కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్‌ ఘటన మరువక మునుపే మరో ఎయిర్‌లైన్‌కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ.

ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్‌ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ సదరు ఎయిర్‌లైన్‌కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్‌లైన్‌ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్‌ కో ఆర్డినేటర్‌, కమర్షియల్‌ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్‌, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది.

దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్‌ ఎయిర్‌లైన్‌ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్‌ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. 

(చదవండి: పాక్‌కు భారత్‌ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!)

మరిన్ని వార్తలు