Mumbai Blast Threat: అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు

23 May, 2023 14:45 IST|Sakshi

ముంబై నగరం ఎప్పుడూ ఉగ్రవాద సంస్థ హిట్‌ లిస్టులో ఉంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరాన్ని బాంబు బ్లాస్ట్‌ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్‌ శాఖకు ట్వీట్‌ చేశారు. ‘ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్‌ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి  26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్‌ కట్‌ చేశాడు. తను రాజస్తాన్‌ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పిఫోన్‌ కట్‌ చేశాడు. ఈ ఫోన్‌ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్‌ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు. 

గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్‌ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్‌ శాఖకు బెదిరింపు ఫోన్స్‌ కాల్స్‌, మెసెజ్‌లు ఎక్కువగా వన్నాయని పోలీసులు తెలిపారు. తీ క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్‌ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీ పోలీసులు బందో బస్తు ఉంటుంది. బెదిరింపు ఫోన్‌లు వస్తే భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు.
చదవండి: భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్ట్‌.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్‌

మరిన్ని వార్తలు