కాలి బ్యాండేజీలో బంగారం

24 May, 2023 13:40 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు.  

స్టీలు కడియం రూపంలో.  
చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్‌ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు  కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు.

మరిన్ని వార్తలు