బంగారు మాస్కు ధర 5 లక్షలు..

23 Jun, 2021 20:55 IST|Sakshi

కాన్పూర్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరైంది. ముఖ్యంగా మాస్కుల పుణ్యమాని తోటి మనుషుల ముఖాలు చూడటం అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని మనోజ్‌ సెనగర్‌  అనే  వ్యక్తి బంగారు మాస్కుతో వార్తల్లో నిలిచాడు. కాన్పూర్‌లో నివాసం ఉండే ఇతడికి  బంగారం అంటే మక్కువట. ఇక రూ.5 లక్షల విలువైన బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో శానిటైజర్ వ్యవస్థ  ఉండడం విశేషం. దీంతో ఈ బంగారు మాస్కును మరే విధంగానూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన శానిటైజేషన్‌ వ్యవస్థ వల్ల దీనిని దాదాపు ఇది 36 నెలల వరకు వినియోగించవచ్చని సెనగర్‌ తెలిపాడు.

ఇక ఈ మాస్కుకు శివ శరణ్ అని పేరు కూడా పెట్టారు. మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరిగే సెనగర్‌ను అక్కవి స్థానికులు బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టే ఏకంగా 5 లక్షల విలువైన బంగారు మాస్కుతో ఆయన మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. అతని వద్దనున్న రివాల్వర్‌కు బంగారు కవర్, మూడు బంగారు బెల్టులు ఉన్నాయి. ఇంత విలువైన సొత్తును దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నాడు. 
చదవండి: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు

మరిన్ని వార్తలు