భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టిస్‌..

21 Sep, 2023 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్‌ న్యూస్‌ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్‌ గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్‌ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యూకేషనల్‌ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్‌ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్‌ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి

ఈ సందర్భంగా ఎన్‌ఎమ్‌సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో  భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్‌ఎమ్‌సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. 

కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది.
చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్‌!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు