గుడ్‌న్యూస్‌ : భారీగా కొత్త కొలువులు

28 Jul, 2020 10:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్‌-19తో ఉద్యోగాల కోతల కాలం సాగుతుండటంతో ఉపాధి రికవరీ రేటు ఇప్పట్లో కోలుకోలేదనే ఆందోళనల నడుమ జులైలో నూతన ఉద్యోగాల డేటా ఆశలు రేకెత్తిస్తోంది. జులైలో కొత్తగా పలు ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. నగరాల్లో ఉపాథి అవకాశాలూ గణనీయంగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది.

జూన్‌తో పోలిస్తే నికర నియామకాలు తగ్గినా జులైలోనూ కొత్త నియామకాలు మెరుగ్గానే ఉన్నాయని, జులై 19 వారాంతానికి ఉద్యోగిత రేటు 38.4 శాతానికి పెరిగిందని సీఎంఐఈ సీఈఓ మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. జూన్‌, జులైలో ఉపాధి రేటు పెరుగుదల నగర ఉద్యోగార్ధుల్లో ఆశలు పెంచుతోంది. జులై నెల తొలి మూడు వారాల్లో సగటు ఉపాధి రేటు 37.5 శాతం కాగా, జులై 19 వారాంతానికి నగరాల్లో ఉద్యోగిత రేటు ఏకంగా 35.1 శాతంగా నమోదైంది. గత రెండు వారాలుగా నగర ప్రాంతాల్లో నియామకాలు ఊపందుకోవడం ఉద్యోగార్ధులకు సానుకూల పరిణామం. నిత్యావసర వస్తువులే కాకుండా సేవల రంగంలోనూ నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే జాబ్‌ మార్కెట్‌లోనూ భారీ రికవరీ చోటుచేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతేనేం..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు