ప్రియుడి కోసం.. ఆస్తమా మందులు మార్చేసి భర్తను దారుణంగా

21 Jun, 2021 08:34 IST|Sakshi

కరోనా మొదలైనప్పటి నుంచి వైరస్‌, ట్రీట్‌మెంట్‌ గురించి మాత్రమే కాదు.. వైరల్‌, పోర్న్‌, క్రైమ్‌కి కంటెంట్‌ను కూడా గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్నారని తేలింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణమైన ఘటన.. అక్కడి ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసి భర్తను కిరాతంగా చంపేసింది. 

భోపాల్‌: ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళ.. తన భర్త అడ్డు తొలగించుకునేందుకు గూగుల్‌ సాయం తీసుకుంది. ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై 15 గంటలు ఏకధాటిగా సెర్చ్‌ చేసింది. భర్తను చంపేశాక.. ఏం తెలియని అమాయకురాలిగా ఫోజులిచ్చింది. అయితే ఫోన్‌లో గూగుల్‌ హిస్టరీ ద్వారానే ఆమె దొరికిపోవడం ఈ కేసులో అసలు ట్విస్ట్‌.. 

హద్రా జిల్లా ఖేడిపూర్‌ ప్రాంతంలో జూన్‌ 18న ఈ ఘటన జరిగింది. ఆమీర్‌ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. భర్త దూరంగా ఉండడంతో అదే ఏరియాలో ఉంటున్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అతని భార్య టబస్సుమ్‌. అయితే లాక్‌డౌన్‌ ప్రభావంతో పని లేకపోవడంతో అమీర్‌.. ఇంటికి వచ్చేశాడు. ఇక భర్త ఇంటిపట్టునే ఉంటాడనే బెంగతో ప్రియుడితో కలిసి ఘాతుకానికి స్కెచ్‌ వేసింది టబుస్సుమ్‌.

ఆస్తమా మందుల్ని మార్చేసి..
అమీర్‌కు హత్య కోసం ఒకరోజంతా గూగుల్‌లో ‘చంపడం ఎలా?, ఎవరి కంట పడకుండా పాతేయడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా?’ అనే విషయాల గురించే వెతుకుతూ కూర్చుంది టబుస్సుమ్‌. ఒక స్కెచ్‌ వేసింది. అమీర్‌కు ఆస్తమా ఉంది. రోజూ మందులు వాడతాడు. జూన్‌ 18న ఆ మందుల్ని మార్చేసింది టబస్సుమ్‌. నకిలీ మందులు తీసుకున్న అమీర్‌ సోయి లేకుండా పడిపోయాడు. ఇక ప్రియుడు ఇర్ఫాన్‌ను అదే రాత్రి ఇంటికి పిలిపించుకుంది. అమీర్‌ కాళ్లు చేతుల్ని స్కార్ఫ్‌లతో కట్టేసి.. ఆపై సుత్తితో తల మీద బాది చంపేశారు. తెల్లవారి తనకేం తెలియదన్నట్లుగా పోలీసుల దగ్గరికి వెళ్లి.. తన భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడని నటించింది.

అయితే అది దొంగల పని అని ముందుగా భావించిన పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ను తేడాగా ఉండడంతో అనుమానించారు. సైబర్‌ సెల్‌ నుంచి టబస్సుమ్‌ కాల్‌ డిటెయిల్స్‌ తెప్పించుకున్నారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని గూగుల్‌ హిస్టరీ ద్వారా ఒక అంచనాకి వచ్చారు. తమ స్టైల్‌లో ఇంటరాగేట్‌ చేయడంతో ఆమె నేరం ఒప్పుకుంది. చివరికి.. ఆ ఆంటీ, ప్రియుడ్ని అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక ఈ దారుణంపై అక్కడి టీవీ ఛానెల్స్‌ డిబేట్లు నడిపిస్తుండడంతో.. హాట్‌టాపిక్‌గా మారింది ఈ కేసు. 

చదవండి: స్మార్ట్‌ కిల్లర్స్‌, రక్తం చుక్క చిందకుండా..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు