బీటెక్‌ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌ న్యూస్‌

3 Dec, 2020 14:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ శుభవార్త అందించింది.  ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. నిర్దేశిత ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాల పాటు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తుకు చివరితేది డిసెంబర్ 11, 2020 అని గూగుల్‌  ప్రకటించింది. హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. (వ్యాక్సిన్‌: ఒబామా, బుష్‌, క్లింటన్‌ సంచలన నిర్ణయం)

అర్హతలు

  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసు​నేందుకు అర్హులు.
  • అభ్యర్థులకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్  జావా, సీ + +, పైథాన్ తెలిసి ఉండాలి.
  • సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా అల్గారిథమ్‌లతో పాటుఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి.
మరిన్ని వార్తలు