బిట్‌కాయిన్‌ బ్యాన్‌?  సొంత క్రిప్టో క‌రెన్సీ 

30 Jan, 2021 15:30 IST|Sakshi

ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే  బిల్లు

క్రిప్టో క‌రెన్సీ రద్దుకు  కేంద్రం కసరత్తు  

సాధ్యం కాదంటున్ననిపుణులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్‌కాయన్‌పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌లో  అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది.  తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్‌  లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది.  అంతేకాదు సొంత క్రిప్టో క‌రెన్సీని లాంచ్‌ చేయాలని కూడా ప్లాన్‌ చేస్తోంది.

ప్రైవేట్ డిజిట‌ల్ క‌రెన్సీ, వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్‌ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని  పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్‌లెట్‌లో  ఆర్‌బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్‌ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్‌ చేసింది.  అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని  కూడా వ్యాఖ్యానించింది.  ప్రతిపాదిత  బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్‌కాయిన్‌, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్‌ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ విధించిన బ్యాన్‌ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది.  (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ)

సాధ్యం కాదంటున్న నిపుణులు 
క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు  'పబ్లిక్'  కనుక ఇవి  నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతు​న్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్‌ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం.  ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్‌ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్‌బీఐ అధికారిక సమాచారంలో, బిట్‌కాయిన్ ప్రైవేట్‌గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్‌చైన్‌లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని  కాయిన్‌డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక​ సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి)

కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌ సెషన్‌లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి

మరిన్ని వార్తలు