కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనీల్‌ చౌహాన్‌

28 Sep, 2022 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్‌ రావత్‌ తర్వాత సీడీఎస్‌గా లెఫ్టినెట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌(రిటైర్ట్‌) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌహాన్‌ 2021, మే నెలలో తూర్పు కమాండ్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్‌. జమ్ముకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. 

త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్‌లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్‌లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్‌, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్‌ పోస్ట్‌ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్‌ను నియమించింది కేంద్రం.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగ్విజయ్‌ సింగ్‌?

మరిన్ని వార్తలు