కోవిడ్‌-19 : ముమ్మర దశను దాటేశాం!

18 Oct, 2020 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్‌ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది. భారత్‌లో ప్రస్తుతం మొత్తం 75 లక్షల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా, శీతాకాలంలో భారత్‌లో రెండోవిడత కరోనా వైరస్‌ కేసుల ఉధృతి పెరిగే అవకాశం లేకపోలేదని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ హెచ్చరించారు. వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులూ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇక భారత్‌లో మొత్తం 75 లక్షల కరోనా వైరస్‌ కేసులు నమోదవగా 66 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ లక్షా14 వేల మంది మరణించారు. చదవండి : డిసెంబర్‌ 31 నాటికి 30 కోట్ల డోస్‌లు రెడీ

మరిన్ని వార్తలు