తమిళనాడు సర్కారుకు గవర్నర్‌ షాక్‌

12 Feb, 2024 12:23 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి అసెంబ్లీకి వచ్చారు.

ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్‌, స్పీకర్‌, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్‌ తెలిపారు.

ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్‌ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్‌ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్‌ పేరా చదవి గవర్నర్‌ ప్రసంగాన్ని ముగించారు. 

ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega