Vaccine Home Delivery ఇంటికే వ్యాక్సిన్‌

24 Sep, 2021 04:52 IST|Sakshi

దివ్యాంగుల కోసం కొత్త విధానం

కేంద్ర ప్రభుత్వం ప్రకటన  

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినే శరణ్యం కావడంతో మరింత మందికి టీకా డోసులు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు, ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి టీకాలు ఇస్తామని నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె. పాల్‌ చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాక్సిన్‌ వేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఇంకా రెండో వేవ్‌ మధ్యలోనే ఉన్నామని∙ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ నుంచే అత్యధికంగా కేసులు వస్తున్నాయని గత వారం 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని చెప్పారు. లక్షకు పైగా యాక్టివ్‌ కోవిడ్‌ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళయేనని వెల్లడించారు.
చదవండి: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అర్హుల్లో 66 శాతం మందికి కరోనా టీకా
దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 66 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ కనీసం ఒక్క డోసైనా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ గురువారం చెప్పారు. 23 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 63.7 శాతం డోసులను గ్రామీణ ప్రాంతాల్లో, 35.4 శాతం డోసులను పట్టణ ప్రాంతాల్లో ఇచ్చినట్లు తెలిపారు. 68.2 లక్షల డోసులను (దాదాపు 0.95 శాతం) కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇచ్చామని, వీటిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేటగిరీలో కలుపలేమని వివరించారు. దేశంలో పండుగల సీజన్‌ మొదలయ్యిందని, కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

మరిన్ని వార్తలు