ఆ చానళ్లను మూసేయండి

22 Dec, 2022 06:03 IST|Sakshi

యూట్యూబ్‌కు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు, సంచలనాత్మక వార్తలను వ్యాప్తి చేస్తున్న మూడు చానళ్లను మూసేయాల్సిందిగా యూట్యూబ్‌ను కేంద్రం ఆదేశించింది. ఆజ్‌తక్‌ లైవ్, న్యూస్‌ హెడ్‌లైన్స్, సర్కారీ అప్‌డేట్స్‌ చానళ్లు తప్పుడు వార్తలకు వాహకాలుగా మారాయని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం మంగళవారం ప్రకటించింది.

కేంద్ర పథకాలతో పాటు సుప్రీంకోర్టు, సీజేఐ, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై కూడా ఇవి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం యూట్యూబ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆజ్‌తక్‌ లైవ్‌ చానల్‌కు ఇండియాటుడే గ్రూప్‌తో సంబంధం లేదని వెల్లడించాయి. ఈ మూడు చానళ్లకు కలిపి 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నాయి. వాటి వీడియోలకు 30 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని వార్తలు