Edible oil: వినియోగదారులకు భారీ ఊరట

17 Jun, 2021 11:09 IST|Sakshi

ఇంపోర్ట్​ డ్యూటీ కుదింపు

దాదాపు 20 శాతం ధర తగ్గింపు

ఈ రోజునుంచే సవరించిన ధరలు అమల్లోకి 

సాక్షి, న్యూఢిల్లీ:  భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు  స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు దిగుమతి  తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  కొత్త రేట్లు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు  87 డాలర్లు తగ్గి  1136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం  టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 1415  డాలర్లుగా ఉంది. అటు ఆర్బిడి పామాయిల్ పై టన్నుకు 1148 డాలర్లకు దిగివచ్చింది.  తాజా తగ్గింపుతో  దేశీయంగా ఆవాలు, సోయాబీన్​, వేరుశనగల రేట్లు కూడా  దిగిరానున్నాయి. 

వంట నూనెల ధరలు కిలోకు
పామాయిల్   రూ.115,  (పాత ధర142, 19 శాతం తగ్గింది)
పొద్దుతిరుగుడు నూనె  రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది)
సోయా నూనె  రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది)
ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు)
వేరుశనగ నూనె   రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు)
వనస్పతి రూ.  141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు)

మరిన్ని వార్తలు