కోవిడ్‌ ఉచిత బూస్టర్‌ డోస్‌లు నిల్‌! కొనుక్కుని వేసుకోవాల్సిందే!

28 Dec, 2022 14:39 IST|Sakshi

చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్‌ బూస్టర్‌​ డోస్‌లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే  60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం

అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్‌ డోస్‌లు అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో కూడా ఎ‍న్నో బూస్టర్‌ డోస్‌లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్‌ సెంటర్‌లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్‌ డోస్‌లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్‌ డోస్‌ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్‌ అంతటా  30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్‌లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్‌లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. 

(చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!)

మరిన్ని వార్తలు