మారటోరియం వడ్డీ మాఫీ: విచారణ వాయిదా

5 Oct, 2020 12:25 IST|Sakshi

అదనపు అఫిడవిట్ల దాఖలుకు ఆర్బీఐకి, కేంద్రానికి  గడువు

తదుపరి విచారణ అక్టోబరు 13కి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో రుణాల పై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం (అక్టోబర్, 5) దీనిపై వాదనలను విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని విజ్ఞప్తి చేసింది. వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం  అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి ఒక వారం సమయం మంజూరు చేసింది.రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని సుప్రీం కోరింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది.(మారటోరియం : భారీ ఊరట)

కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు  కేంద్రం భారీ ఊరట లభించింది. కోవిడ్‌ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు ఆర్థిక శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు