Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’

4 Oct, 2021 14:24 IST|Sakshi

పరిహారం ప్రకటించిన యూపీ ప్రభుత్వం

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఆదివారం లఖీమ్‌పూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.45లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.

కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్‌ మృతి చెందారు. సోమవారం లఖీమ్‌పూర్‌ ఖేరీలో ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు మృతి చెందారు.

>
మరిన్ని వార్తలు