డీఆర్‌డీఓ: సతీష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు

24 Aug, 2020 21:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్‌ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండుళ్ల పాటు పొడిగించింది. ప్రస్తుతం డీఆర్‌డీఓ చీఫ్‌గా కొనసాగుతున్న సతీష్‌రెడ్డిని మరో రెండేళ్లు అదే పదవిలో కొసాగించాలని సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్వర్వులు సైతం జారీచేసింది.  ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా కూడా ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు