సామాన్యులకు ఊరట.. జీఎస్‌టీ తొలగింపు!

29 Apr, 2021 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ధరలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఎక్కువ శాతం మంది వాక్సిన్ ఉచితంగా అందజేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలపై భారం తగ్గించేలా టీకాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రద్దు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జీఎస్‌టీ రద్దు వల్ల టీకా ధరలు తగ్గి ఎక్కువ మంది ప్రైవేట్ గా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు 300 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలు అందించనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు మోతాదుకు 600 రూపాయలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు 1,200 రూపాయలకు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి రెండు డోసులు తీసుకోవడం వల్ల కరోనా నుంచి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది అని కేంద్రం పేర్కొంది. కరోనావైరస్ చికిత్స కోసం మందులను తయారు చేయడానికి అవసరమైన ఔషధ ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది.

చదవండి:

ప్రోనింగ్ టెక్నిక్‌తో క‌రోనాను జ‌యించిన 82 ఏళ్ల బామ్మ

మరిన్ని వార్తలు