నానో డీఏపీతో సాగు మరింత సులువు: ప్రధాని మోదీ

6 Mar, 2023 05:13 IST|Sakshi

న్యూఢిల్లీ: నానో లిక్విడ్‌ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్‌)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.

నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చేసిన ట్వీట్‌కు ప్రధాని ఈ మేరకు స్పందించారు. ఎరువులపై స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగుగా ప్రధాని పేర్కొన్నారు. ఎరువుల సహకార సంఘం ఇఫ్‌కో 2021లో నానో లిక్విడ్‌ యూరియాను ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు