కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌

10 Apr, 2021 05:59 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్‌ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్‌ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.

ఇండియాలోనూ కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్‌ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్‌ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు