కరోనా సెకండ్‌వేవ్‌: ప్రజలకు కేంద్రం తీపికబురు!

23 Apr, 2021 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభణ వలన దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం,  పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద  పేదలకు తీపికబురు అందించింది. 

ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లభ్దిదారునికి  మే, జూన్‌ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో, దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. 

చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు