ఇకపై స్విగ్గీలో స్ట్రీట్‌ ఫుడ్‌ 

6 Oct, 2020 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్డుపక్కన తినుబండారాలను త్వరలోనే తమ ఇళ్ళవద్దనే రుచి చూసే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీతో కలిసి, ఈ చిన్న వీధి వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురానుంది. పైలెట్‌ పథకంలో భాగంగా దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి నగరాల్లోని 250 వీధి ఆహార సరఫరా దారులతోటి ప్రారంభించి, దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది.

వీధి వర్తకులు, వేలాది మంది వినియోగదారులను ఆన్‌లైన్‌లో చేరడానికి ఈ పథకాన్ని ‘ప్రైమ్‌ మినిస్టర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌నిధి’ కిందకు తీసుకువస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. వీధి వర్తకులకు పాన్‌ కార్డ్‌ పొందడానికి, ఆహారభద్రతా ప్రమాణాల అథారిటీతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి, యాప్‌ల వినియోగంపై  సహకరించనుంది. ఈ దుకాణం పెట్టుకోవడానికి,  50 లక్షల మంది వీధి వర్తకులకు రూ.10 వేల æసాయాన్ని అందించనుంది.  (ఇక డ్రోన్స్‌తో ఫుడ్‌ డెలివరీ!)

మరిన్ని వార్తలు