విదేశాల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్‌!

15 Dec, 2021 15:23 IST|Sakshi

సాక్షి,బరంపురం: చిలికా సరస్సుకు ప్రతీ ఏడాది మాదిరిగానే విదేశీ పక్షులు వచ్చి చేరుతున్నాయి.తమ జాతి పక్షులతో జతకట్టేందుకు చిలికా దీవుల్లో విడిదిని ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా చలి ఎక్కువై లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సుకు చేరుతున్నాయి. విదేశీ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చిలికా వన్యప్రాణి అభివృధ్ధి సంస్థ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటుచేశారు. ( చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా? )

మూడు వారాలుగా సుమారు 8.94 లక్షల విదేశీ పక్షులు సరస్సుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంతానానికి శ్రీకారం రకరకాల విదేశీ పక్షులు చిలికా సరస్సు మధ్యన ఉన్న బరుకుల్, నల్లబాల, కాళీజై, సత్తపరా, బ్రేక్‌పాస్టు, శరణ్, చోడైహోగా, మంగళాజోడి, పరికుద్‌ దీవులకు లక్షల సంఖ్యలో చేరుకొని విడిదిని ఏర్పర్చుకున్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పును మనుషులతో పాటు పక్షులు కూడా తెలుసుకుంటాయనడానికి.. చలికాలంలో చిలికా సరస్సుకి లక్షలాది పక్షులు రావడమే నిదర్శనం. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గూడు కట్టుకొని తమ జాతి పక్షులతో జతకలిసి సంతాన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాయి.

 చదవండి: లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు..

మరిన్ని వార్తలు