-

ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్‌ కారిడార్‌

28 Nov, 2023 17:07 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చే విషయంలో కీలక పురోగతి.  దాదాపు 17 రోజుల పాటు టన్నెల్‌లో  ఉన్న కార్మికులు ఎట్టకేలకు వెలుగు చూసే క్షణాలు సమీపిస్తున్నాయి. దీంతో అక్కడంతా ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఉద్వేగభరిత క్షణాలకోసం కుటుంబ సభ్యులతో పాటు,  రెస్క్యూ ఆపరేషన్‌  టీం ఎదురు చూస్తున్నారు.  ట‌న్నెల్‌లో అమ‌ర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం  వారిని  బ‌య‌ట‌కు  తీసుకురానుంది.

మరోవైపు  కార్మికులు బైటికి వచ్చిన వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లు కూడా టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు.  సిల్క్యారా సొరంగం ప్రవేశ ద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి.  వీటి ద్వారా కార్మికులను సమీప వైద్య శాలలకు తరలిస్తారు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు  చేశారు. తద్వారా  బయటికి వచ్చిన కార్మికులదరిన్నీ హుటాహుటిన ఈ సొరంగం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు  తరలిస్తారు. కార్మికులకు స్వాగతం పలికేందుకు పూలమాలలు కూడా  సిద్ధం చేశారు.

ఒక్కో వ్యక్తిని బయటకు తీయడానికి మూడు నుండి ఐదు నిమిషాలు పడుతుంది. కాబట్టి, మొత్తం 41 మంది కార్మికులను రక్షించేందుకు నుండి నాలుగు గంటల సమయం పడుతుందని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూపై NDMA సభ్యుడు లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు.

ప్రతి కార్మికుడికి సత్వర వైద్య సంరక్షణ అందించేలా  41 ఆక్సిజన్‌తో కూడిన పడకలతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. వ‌ర్క‌ర్లు అంద‌ర్నీ రెస్క్యూ చేయ‌నున్న‌ట్లు కార్మికుల‌కు త‌క్ష‌ణ వైద్యం స‌హాయం అందించేందుకు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి,  ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో  ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి యూపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సమన్వయకర్త అరుణ్ మిశ్రా  ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే  కార్మికులంతా బైటికి రానున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు