అత్తగారి అదిరిపోయే డాన్స్‌: చూస్తూ ఉండిపోయిన వధువు!

23 Aug, 2021 15:19 IST|Sakshi

అత్తగారి ఎనర్జటిక్‌ పెర్‌ఫామెన్స్‌: నెటిజన్లు ఫిదా  

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లిళ్లలో సంగీత్‌లు, బారాత్‌లు, డ్యాన్స్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. అంతేకాదు ఇలాంటి వేడుకల్లో వధూవరులతోపాటు, బంధువులు, స్నేహితులు స్టెప్పులతో ఇరగదీయడం కూడా చాలా కామన్‌గా మారి పోయింది. ఇటీవల ‘బుల్లెట్టు బండి’ పాటతో ఒక తెలుగింటి నవ వధువు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా వీటన్నింటికీ భిన్నంగా వరుడి తల్లి చేసిన డ్యాన్స్‌ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.  

చదవండి : Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు
చర్చకు దారి తీసిన ఆనంద్‌ మహీంద్ర వైరల్‌ వీడియో

వరుడి తల్లి పంజాబీ పాటకు భాంగ్రా నృత్యంతో పెద్ద సం‍చలనమే సృష్టించింది. దీనికి తోడు ఆమె పాటకు  ఆమె బంధువులు డబ్బుల వర్షం కురిపించడం విశేషం. అటు అత్తగారి పెర్‌ఫామెన్స్‌కు వధువు ముచ్చటగా అలా చూస్తూ ఉండి పోయింది. ఈ వయసులో  కూడా ఎంత ఎనర్జటిక్‌  స్టెప్స్‌! అంటూ  నెటిజన్లు ఫిదా. 

చదవండి : Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా

A post shared by 𝔖aͥɴaͣmͫ (@i.am.sanam)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు