పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్‌.. వామ్మో!

8 Jun, 2021 11:24 IST|Sakshi

ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వరుడు చేసే వింత పనులకు విసుగెత్తిన నవ వధువు వెంటనే కటీఫ్‌ చెబుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పెళ్లి మధ్యలో ఓ వరుడు లేచి డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

పెళ్లి మండపంలో వరుడు, వధువు కూర్చుని ఉండగా.. పక్కనే పురోహితుడు పెళ్లి కార్యక్రమాలను నడిపిస్తున్నాడు. అయితే పెళ్లి కొడుకు అకస్మాత్తుగా లేచి.. బాడీ మొత్తం షేక్‌ చేస్తూ డ్యాన్స్‌ చేస్తాడు. పట్టరాని ఆనందంలో సంతోషాన్ని వ్యక్త చేస్తాడు. దీంతో పెళ్లి కూతురితో పాటు చుట్టూ ఉన్న బంధువులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు.

(చదవండి: వైరల్‌: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు