అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్‌ కట్‌ చేస్తే...

15 Jun, 2022 20:45 IST|Sakshi

ఇటీవల యువత చాలా అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఐతే ఇక్కడోక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వరడుకి కేవలం పెళ్లి ఊరేగింపుకే రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకో తెలుసా!

వివరాల్లోకెళ్తే....ముజఫర్నార్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం వరుస లగ్జరీ అడీ కార్లలతో సందడి చేసింది. వరుడు అతని స్నేహితుల బృందం టాప్‌లెస్‌ కారులో డ్యాన్స్‌లు చేశారు. మరికొంతమంది కారు కిటికిలోంచి వేలాడుతూ సెల్పీలు తీయడం వంటి పనులు చేశారు.

ఐతే  ఇలాంటి స్టంట్‌లు తోటి ప్రయాణికుల భద్రతను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేస్తూ అంకిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్‌ చేశారు. అతను ట్విట్టర్‌లో... తాను హరిద్వార్‌ నుంచి నోయిడా వెళ్తున్న సమయంలో.. ముజఫర్‌ నగర్‌ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.

ఈ విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసులు గ్రహిస్తారని ఆశిస్తున్న అని ట్వీట్‌ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు పెళ్లి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఊరేగింపులో ఉపయోగించిన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కారు యజమానులపై రూ. 2 లక్షలు జరిమాన విధించారు కూడా.

(చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్‌ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!)

మరిన్ని వార్తలు