జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌10కు నేటి నుంచి కౌంట్‌డౌన్‌

11 Aug, 2021 03:17 IST|Sakshi

రేపు ఉదయం 5.43కు ప్రయోగం  

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం ఉదయం 5.43 గంటలకు సూళ్లూరుపేటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌ 10 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని కోసం బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇస్రో చైర్మన్‌ శివన్‌ నేతృత్వంలో షార్‌లో మిషన్‌ సంసిద్ధత సమావేశం జరిగింది.

అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. రాకెట్‌లోని రెండో దశలో భాగంగా ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన వెంటనే చేపట్టనున్నారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం ఉదయం 5.43కు ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌(ఈవోఎస్‌)–03తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.  

మరిన్ని వార్తలు