వింత ఘటన.. ఆధార్‌ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్‌

26 Sep, 2022 06:05 IST|Sakshi

అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం.

దాంతో, ఆధార్‌ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్‌ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు