'18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000'

11 Aug, 2022 08:57 IST|Sakshi

గుజరాత్‌లో కేజ్రీవాల్‌ ఎన్నికల హామీ

అహ్మదాబాద్‌: రాబోయే గుజరాత్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్ర మహిళలకు కొత్త హామీనిచ్చారు. ఆప్‌ను అధికార పీఠంపై కూర్చోబెడితే 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో బుధవారం వందలాది మంది మహిళల సమక్షంలో ఆయన ఈ హామీనిచ్చారు. ‘ రూ.1,000 అనేది ఉచిత తాయిలం కానేకాదు. ఇది మీ హక్కు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజల చెంతకే చేరాలి’ అంటూ కేజ్రీవాల్‌ ప్రసంగించారు.

చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్‌.. తీ​వ్ర విమర్శలు)

మరిన్ని వార్తలు