గుజరాత్‌ సీఎంకు కరోనా

15 Feb, 2021 13:16 IST|Sakshi

సాక్షి, వడోదర: గుజరాత్‌ ముఖ‍్యమంత్రి విజయ్‌ రూపానీ కరోనా బారిన పడ్డారు. ఆదివారం స్వల్ప అనారోగ్యంతో ఎన్నికల సభలో మాట్లడుతూ కళ్లు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో సీఎంకు కరోనా వైరస్‌ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రూపానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అన్ని పారామీటర్స్‌ నార్మల్‌ ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అటు దేశవ్యాప్తంగా కరోనా‌ మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తమ నేత, ముఖ్యమంత్రి రూపానీ వైరస్‌ బారిన పడటంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. (వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా)

పిబ్ర‌వ‌రి 21న జ‌ర‌గనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నిక‌ల సభలో ప్ర‌సంగిస్తూ  రూపానీ స్పృహ త‌ప్పిప‌డిపోయారు. సీఎం  ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌నీ ప్రకటించిన వైద్యులు 24 గంట‌ల పాటు రూపానీని అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచాలని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో రెండో విడత కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు