అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి చిందులేస్తూ హల్‌చల్‌

17 Apr, 2021 00:29 IST|Sakshi

గాంధీనగర్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా తీసుకున్న ఆంక్షలను కొందరు నిర్లక్ష్యం చేస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడింది. చివరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్ల కోసం చేసిన ప్రయత్నం ఆమెను చిక్కుల్లో నెట్టేసింది.

గుజరాత్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయితే రాజ్‌కోట్‌కు చెందిన యువతి ప్రిషా రాథోడ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. అయితే వారిని ఆకట్టుకునేందుకు కర్ఫ్యూ రాత్రి డ్యాన్స్‌ చేయాలని రాత్రి 11 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. ఓ ఆంగ్ల పాటకు డ్యాన్స్‌లు చేసి రికార్డు చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వివరాలు సేకరించారు.

కర్ఫ్యూ ఉల్లంఘించిందని ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్‌ చేశానని.. ఆ వీడియోను చాలా మంది షేర్‌ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు వివరణ ఇచ్చింది. ఏది ఏమున్నా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్‌కోట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తుంటరి పనులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

చదవండి: ‘జియో’ దెబ్బకు తట్టా, బుట్టా సర్దుకున్నా
చదవండి: బీజేపీకి అండగా టీఆర్‌ఎస్‌.. ఉత్తమ్‌కు కేటీఆర్‌ ఫోన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు