హర్‌ ఘర్‌ తిరంగాలో అపశ్రుతి.. దూసుకొచ్చిన ఆవు.. మాజీ మంత్రికి గాయం

13 Aug, 2022 17:10 IST|Sakshi

అహ్మదాబాద్‌: డెబ్భై ఐదేళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగాకు పిలుపు ఇచ్చింది. ఇంటా వాకిట బడి బండ్లు అనే తేడా లేకుండా అంతటా మూడు రంగుల మయం అయిపోయింది. మరోవైపు హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం. ఇదిలా ఉండగా..

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో గుజరాత్‌ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ గాయపడ్డారు. శనివారం మెహ్‌సనా జిల్లా కడి ప్రాంతంలో ఆయన నేతృత్వంలో ర్యాలీ జరిగింది. అయితే వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. ఆవు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో.. ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. 

ఆపై ఎస్కార్ట్‌ సాయంతో అహ్మదాబాద్‌ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్‌ అయ్యిందని, నెలరోజుల రెస్ట్‌ అవసరమని బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: రాఖీలో విషాదం.. గాలిపటం దారం యమపాశమై! 

మరిన్ని వార్తలు