గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యాక్సిన్‌ వేసుకోకుంటే అక్కడికి ఎంట్రీ లేదు

11 Nov, 2021 19:23 IST|Sakshi

ఆహ్మదాబాద్‌: ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌. అయితే తొలి డోస్‌ కోసం ఎగబడ్డ జనం.. రెండో డోస్‌ వేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. కరోనా తగ్గిపోయిందని భావించి, వ్యాక్సిన్‌ వేసుకుంటే వచ్చే జ్వరం, నొప్పులు వంటి భయాలతో రెండో డోస్‌ వేసుకునేందుకు  ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు, ప్రభుత్వాలు వ్యాక్సిన్‌పై భయాందోళనలు పోయేలా, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి.
చదవండి: కేసీఆర్‌ ఆరోపణలు పెద్ద డ్రామా: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ 

ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని పలు ఉద్యోగ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.  వ్యాక్సిన్‌ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్‌ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 12 నుంచి 18 ఏళ్లు నిండి ఉండి వ్యాక్సినేషన్‌ తీసుకొని వారికి పబ్లిక్‌ ప్లేస్‌లోకి అనుమతి నిషేధించింది. 
చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి

అహ్మదాబాద్ మునిసిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఏఎమ్‌టీఎస్‌),అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీర్‌టీఎస్‌) బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక టీకా తీసుకొని వారు కంకారియా లేక్ ఫ్రంట్, కంకారియా జూ,యు సబర్మతి రివర్ ఫ్రంట్‌లోకి ప్రవేశం లేదని వెల్లడించింది. లైబ్రరీ, జింఖానా, స్విమ్మింగ్ పూల్, ఎంఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిటీ సివిక్ సెంటర్,  కార్పొరేషన్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లు తప్పని సరి తనిఖీ చేస్తామని తెలిపింది.
చదవండి: బంపర్‌ ఆఫర్‌....వ్యాక్సిన్‌ తీసుకో..బహుమతి పట్టు

కాగా గత నెలల్లో రోజువారీ కోవిడ్‌ కోసులు గుజరాత్‌లో తొలిసారి 40 దాటాయి. అయితే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 36 మంది కోలకున్నారు. గుజరాత్‌లో ఇప్పటి వరకు 8కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు