‘భర్త’ చేసిన పనితో గుండె బద్ధలైన భార్య.. పెళ్లైన ఎనిమిదేళ్లకు అసలు నిజం

16 Sep, 2022 11:29 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

ఎనిమిదేళ్లుగా ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. చుట్టుపక్కల వాళ్లకు ఆదర్శంగా నిలిచింది. అలాంటి జంట జీవితంలో.. ఎనిమిదేళ్ల తర్వాత అనుకోకుండా ఒకరోజు అలజడి రేగింది. భర్త తన దగ్గర దాచిన నిజంతో ఆ భార్య గుండెబద్ధలైంది. న్యాయం కోసం ఇప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

ఆమె భర్త పురుషుడే కాదన్న నిజం.. ఆమెను వణికిపోయేలా చేసింది. గుజరాత్‌ వడోదరకు చెందిన మహిళ.. మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేస్తున్న విరాజ్‌ వర్దన్‌ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే శారీరకంగా కలవకుండా చాలాకాలంపాటు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు విరాజ్‌. దీంతో ఆమె ఒత్తిడి చేయగా.. 

గతంలో రష్యాలో ఉండగా తనకు యాక్సిడెంట్‌ అయ్యిందని.. సంసార సుఖానికి తాను పనికిరానని, మైనర్‌ సర్జరీ జరిగితే తాను మామూలు స్థితికి రాలేనని ఆమెతో చెప్పేశాడు. దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడనుకుని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే మెదులుతూ వచ్చింది. ఇలా ఉండగా.. 2020 జనవరిలో బరువు తగ్గే సర్జరీ కోసం కోల్‌కతా వెళ్లాడు విరాజ్‌. తిరిగొచ్చిన విరాజ్‌.. తన భార్యతో శారీరకంగా కలవడం మొదలుపెట్టాడు.

అయితే అతను కోల్‌కతా వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుడి అవయవాల మార్పిడి కోసమని డాక్టర్‌ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న ఆమెకు నోట పడిపోయింది. భర్త చేసిన మోసం ఒక్కొక్కటిగా ఆమెకు తెలిశాయి. విజైతా అనే యువతి.. సర్జరీ ద్వారా విరాజ్‌గా మారి.. మ్యాట్రిమోనియల్‌ సర్జరీ ద్వారా తనను సంప్రదించిందని, విజైతా కుటుంబం కూడా తనను మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. ఢిల్లీలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేసి.. వడోదరాకు తీసుకొచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఈ జంటకు కౌన్సెలింగ్‌ ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది.

ఇదీ చదవండి: తాగిన మత్తులో .. మహిళతో ఇలాగేనా ప్రవర్తించేది?

మరిన్ని వార్తలు