Viral Video: కారుపై 'హర్‌ ఘర్‌ తిరంగ' థీమ్‌తో హల్‌చల్‌ చేస్తున్న యువకుడు

14 Aug, 2022 19:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతకాన్ని ఎగరువేయాలని భారత ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర వచ్చి  ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు13 నుంచి ఆగస్టు 15 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

అందులో భాగంగా గుజరాత్‌కి చెందిన ఓ యువకుడు తాను సైతం అంటూ ఈ ప్రచారాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాడు. అందుకోసం హర్‌ ఘర్‌ తిరంగ అనే థీమ్‌ని సుమారు రూ. 2 లక్షలు వెచ్చించి మరీ కారు పై వేయించుకున్నాడు. అతను కూడా ఈ "హర్‌ ఘర్‌ తిరంగ ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనుకున్నాడు.

ఈ మేరకు అతను రెండు రోజుల్లో తన స్వస్థలం సూరత్‌ నుంచి కారులో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నాడు. తాను ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు రోజుల్లో తన కారులో గుజరాత్‌ నుంచి ఢిల్లీ వరకు పర్యటించానని ఆనందంగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’)

మరిన్ని వార్తలు