కోతిని మింగేసిన కొండచిలువ..తరువాత ఏమైందంటే!

10 Aug, 2021 12:41 IST|Sakshi

కోతిని మింగిన 10 అడుగుల పైథాన్‌

రక్షించిన   అటవీ సిబ్బంది

ఆ తరువాతి  కక్కేసిన కొండచిలువ

వడోదర: భారీ కొండచిలువ ఏకంగా ఓ కోతిని మింగేసింది. తరువాత కదల్లేక నదిలో ఉండిపోవడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను గుజరాత్ అటవీశాఖ అధికారులు మంగళవారం రక్షించారు.  వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు.

ముగ్గురు రక్షకులు నది నుండి దీనిని బయటకు తీసారని, అనంతరం మింగేసిన కోతిని వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పైథాన్‌ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు