Eco Friendliness :ఓల్డ్‌ కార్‌ సీట్‌ బెల్ట్‌తో బ్యాగ్‌లు

3 Oct, 2021 17:47 IST|Sakshi

చాలామంది ఉపయోగ పడని వస్తువులను, వ్యర్థాలను రీసైకిల్‌ చేసి వాటితో రకరకాలు వస్తువులను తయారు చేసే స్టార్ట్‌ప్‌ బిజినెస్‌లను మనం చాలానే చూశాం. ప్రస్తుతం యువత కొంగొత్త ఆవిష్కరణలతో చెత్తను తొలగించి పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే కోవకు చెందినవారు గుర్గావ్‌కి చెందిన గౌతమ్‌ మాలిక్‌. ఆయన పేరుకుపోతున్న పారిశ్రామిక వ్యర్థాలకు అడ్డుకట్ట వేసేలా పర్యావరణ రహిత జాగ్గరీ బ్యాగ్‌లు తయారు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. ఆయన ఎవరు? జాగ్గరీ బ్యాగ్‌లు ఏంటి అనే కదా సందేహం అసలు విషయం ఏమిటో చూద్దాం.

హర్యానా: గుర్గావ్‌ హర్యానాలో అతిపెద్ద నగరం, ఇది హర్యానా ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా పరిగణిస్తారు. ఈ గుర్గావ్‌కి చెందిన ఒక స్టార్ట్‌ప్‌ కంపెనీ పాత కార్ల సీట్‌ బెల్ట్‌, మాజీ ఆర్మీ అధికారుల కాన్వాస్‌(జనపనారతో తయారు చేసిన గట్టి వస్రం (గుడారాలు(టెంట్‌లకు ఉపయోగించేది​), సరకులు రవాణ చేయడానికీ ఉపయోగించే కార్గో కాన్వాస్‌ వంటి మెటీరియల్స్‌ సాయంతో ఈ జీరో వేస్ట్‌ జాగ్గరీ ఫ్యాన్సీ బ్యాగులు తయారు చేశాడు. ఈ స్టార్ట్‌ప్‌ కంపెనీ వ్యవస్థాపకులు గౌతమ్‌ మాలిక్‌, అతని భార్య భావన దండోనా, తల్లి  డాక్టర్‌ ఉషా మాలిక్‌లు.

(చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్)

కార్యరూపం దాల్చేలా చేసిన ప్రయత్నాలు.....
మొదట్లో ట్రక్‌లో  వాడే టార్సాలిన్‌(సరకు తడి అవ్వకుండా అల్లిన వస్త్రం‌) , పాతకాలంలో వాడే నులక మంచం నవారు, టీపాయ్‌ తదితర వస్తువులతో ప్రారంభించనప్పుడు అంతగా  ఫలితానివ్వలేదన్నారు గౌతమ్‌. ప్లాస్టిక్‌ రహిత బ్యాగ్‌లు తయారు చేయడమేకాక గుట్టగుట్టలుగా పేరుకుపోతున్న పారిశ్రామిక వ్యర్థాలను నివారించాలనేది ఆలోచన కానీ కార్యరూపం దాల్చడానికీ చాలా శ్రమపడవలసి వచ్చిందని గౌతమ్‌ చెప్పారు. ఏవిధంగా తయారుచేయాలి అనుకుంటూ ఉండగా పాత కార్లలో ఉండే సీట్‌ బెల్ట్‌తోపాటు హైవేలపై భారీ కంటైనర్‌లోని సరుకును కట్టడానికీ వాడే కార్గో బెల్టలు 4వేల పౌండ్ల బరువును మోయగల సామర్థ్యం గల  బెల్ట్‌లపై   దృష్టి సారించడంతో మంచి ఫలితాన్ని సాధించగలిగానన్నారు. అంతే కాదు ఈ జాగ్గరీ బ్యాగ్‌లు చాలా ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయని అందుకు తాను ఆరేళ్లుగా వాడుతున్న వాలెట్టే(పర్సు) నిదర్శనం అన్నారు.

ఎందుకు ఆ పేరు పెట్టారంటే ?
గౌతమ్‌ కుటుంబంతో సహా 2010తో అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత ఈ కామర్స్‌ కంపెనీలో క్రియోటివ్‌ హెడ్‌గా పనిచేశారు. ఈ అనుభవం ఈ స్టార్టప్‌ కంపెనీ ఆవిష్కరణకు ఉపకరించింది. దీంతో వస్తువుల తయారీదారులకు మార్కెట్‌కి మధ్య అంతర్యాన్ని తగ్గించేలాకృషి చేశాడు. భారతీయులు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యం కోసం బెల్లాన్ని ఏవిధంగా వినియోగిస్తారో అలా  పర్యావరణానికి హాని కలిగించే బ్యాగ్‌ల స్థానంలో ఈ బ్యాగ్‌లు వచ్చాయి కాబట్టి  జాగ్గరీ బ్యాగ్‌ అని పేరు పెట్టామని గౌతమ్‌ వివరించారు.

(చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు